ఛత్రపతి సినిమాలోని అమ్మ పాట......నల్లనివన్ని నీళ్ళలని తెల్లనివన్ని పాలని

 నల్లనివన్ని నీళ్ళనీ తెల్లనివన్ని పాలని 
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
జరిగినా కథ విని ఈ కడలి నవ్వింది
మమతకే తగనని తొలి సారి తెలిసింది
                                         // నల్లనివన్ని//
వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్న
అంతులేని కడలి లోతును నేను చూస్తున్న
కడుపులో నిను మెాయకున్న అమ్మ తప్పుని
కడుపులోన దాచుకున్న నిన్ను చూస్తున్న
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఓట్టు
                                           //నల్లనివన్ని//
తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసినా
ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు
సచ్చి పుడుత నాయన బిడ్డగా నీ కడుపునా
జరిగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఓట్టు
                                       //నల్లనివన్ని//

Comments